నల్గొండ పట్టణంలోని డైట్ కాలేజ్ సమీపంలో మంగళవారం చోటుచేసుకున్న దారుణ ఘటన కలకలం రేపింది. ప్రేమ పేరుతో ఒక మైనర్ ఇంటర్ విద్యార్థినిని మోసం చేసి, అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన బయటపడింది.
పోలీసుల సమాచారం ప్రకారం — నిందితుడు కృష్ణ గౌడ్ (ట్రాక్టర్ డ్రైవర్) గత ఆరు నెలలుగా బాధితురాలితో ప్రేమ పేరుతో పరిచయం కొనసాగించాడు. మంగళవారం ఆమెను స్నేహితుడి గదికి తీసుకెళ్లి అక్కడ అత్యాచారం చేసిన అనంతరం ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు తెలుస్తోంది.
స్థానికులు సమాచారంతో చేరిన పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ కొనసాగుతోందని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని పోలీస్ అధికారులు తెలిపారు.
ఈ ఘటనతో నల్గొండ పట్టణంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రజలు నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.

