ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ మంగళవారం పొదిలి, దర్శి ప్రాంతాల్లో ఆకస్మిక మరియు విస్తృత తనిఖీలు నిర్వహించింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, గతంలో గంజాయి కేసుల్లో నిందితులుగా ఉన్నవారి ఇళ్లతో పాటు రద్దీ ప్రాంతాలను ప్రత్యేకంగా తనిఖీ చేశారు.
డాగ్ స్క్వాడ్ రాక్సీ సహాయంతో అనుమానాస్పద వస్తువులు, లగేజీలు, పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించారు. పొదిలిలో ఆర్టీసీ బస్టాండ్, పార్సిల్ పాయింట్, బెస్తపాలెం ప్రాంతాల్లో, దర్శిలో గడియారం స్తంభం, ఆర్టీసీ బస్టాండ్ వంటి ప్రాంతాల్లో సిబ్బంది తనిఖీలు జరిపారు.
జిల్లా పోలీసులు శాంతిభద్రత, నేర నియంత్రణ విషయంలో ఎటువంటి రాజీ లేకుండా పనిచేస్తున్నట్టు స్పష్టం చేశారు. ప్రజలు అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు లేదా వాహనాలను గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా డయల్ 112 కు సమాచారం అందించాలని కోరారు.

