Tv424x7
Andhrapradesh

వాట్సాప్ ద్వారా ప్రభుత్వ అందించే సేవలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి….

…..

వాట్సాప్ ద్వారా ప్రభుత్వము అందించే సేవలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని జిల్లాలో భూగర్భ జలాలు పెరగడమే ధ్యేయంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు

మంగళవారం సాయంత్రం అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్…. సబ్ కలెక్టర్లు ఆర్డిఓ తాసిల్దార్లు మునిసిపల్ కమిషనర్లు ఎంపీడీవోలు నీటిపారుదల శాఖ హౌసింగ్ శాఖ తదితర శాఖల అధికారులతో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమాలు, పి జి ఆర్ ఎస్ ద్వారా అందిన సమస్యల పరిష్కారం, వాట్సాప్ గవర్నెన్స్, జీవో ఎంఎస్ నెంబర్ 30, ప్రజల నుండి వివిధ అంశాలపై తీసుకున్న ప్రజాభిప్రాయ సేకరణ, జలజీవన్ మిషన్ కు అవసరమయ్యే భూసేకరణ, రీ సర్వే, నరేగా, చిన్న తరహా నీటిపారుదల, స్వచ్ఛ ఆంధ్ర, తదితర అంశాలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై అవగాహన కార్యక్రమాలను ప్రజలందరికీ చేరువయ్యేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించాలని కార్యక్రమాల అనంతరం సంబంధిత ఫోటోలను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని సూచించారు. బ్యాంకర్లతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని జిఎస్టి తగ్గింపు పై ప్రజల్లో అవగాహన పెంచేలా చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్లను ఆర్డిఓ ను ఆదేశించారు. విభిన్న సామర్ధ్యాలు కలిగిన కలిగిన వారి పింఛన్లపై సమీక్షిస్తూ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ మరియు డిఆర్డిఏ శాఖలు సమన్వయంతో వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఎంపీడీవోలు ఈ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలన్నారు. పి జి ఆర్ ఎస్ ద్వారా అందే సమస్యలపై పరిష్కారాలను నాణ్యతతో ప్రజలకు అందేలా చూడాలన్నారు. అర్జీదారులతో సఖ్యతగా మెలగాలని మానవతా దృక్పథంతో వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. జీవో ఎంఎస్ నెంబర్ 30 పైసమీక్షిస్తూ రెగ్యులరైజేషన్ ప్రక్రియలో పెండింగ్ పనులను పూర్తి చేయాలన్నారు. వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలపై ప్రజల్లో ఎక్కువగా అవగాహన కల్పించి వాట్సాప్ ద్వారా అంది సేవలను వినియోగించుకునేలా చేయాలన్నారు.

జలజీవన్ మిషన్ కార్యక్రమంలో గ్రామీణ నీటి సరఫరా శాఖకు అవసరమయ్యే భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. చిన్న తరహా నీటిపారుదల శాఖపై సమీక్షిస్తూ ట్యాంకులు పూర్తిగా నిండేలా చర్యలు తీసుకోవాలని మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకంతో సమన్వయం చేసుకొని వర్షం పడినప్పుడు ట్యాంకులు నిండి భూగర్భ జలాలు పెరిగేలా చూడాలన్నారు.

రీ సర్వే పై సమీక్షిస్తూ మొదటి ఫేస్ లో చేసిన తప్పులు రెండవ ఫేస్ లో చేయకుండా చూడాలని ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. స్వర్ణాంధ్ర 247 పై సమీక్షిస్తూ అన్ని శాఖల ఉన్నతాధికారులు వారి శాఖలకు సంబంధించిన వివరాలను సిపిఓ కి అందించాలని సూచించారు. హౌసింగ్ శాఖ పై సమీక్షిస్తూ స్టేజ్ కన్వర్షన్ లో పురోగతి సాధించాలని ఆదేశించారు. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం పై సమీక్ష ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ కార్యక్రమాన్ని 100% జరిగేలా చూడాలన్నారు.

చెత్త సేకరణ పై ప్రజాభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని సంబంధిత గ్రామపంచాయతీలు చర్యలు చేపట్టాలన్నారు. మునిసిపల్ పరిపాలన పై సమీక్షిస్తూ మునిసిపాలిటీలలో నీటి సరఫరా జరిగే పైప్ లైన్లు డ్రైనేజీ పైప్లైన్లు కలవకుండా చూడాలని మంచినీరు కలుషితం కాకూడదని దీనికి చేపట్టాల్సిన చర్యలను వెంటనే చేపట్టాలన్నారు. అన్న క్యాంటీన్లు పరిశుభ్రంగా ఉండాలని, భోజనం సమయానికి ప్రజలకు అందేలా చూడాలన్నారు.

ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, డిఆర్ఓ మధుసూదన్ రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

మైదుకూరు డీఎస్పీకి చార్జ్ మెమో

TV4-24X7 News

రెండో జాబితా సిద్ధం చేసిన జగన్….

TV4-24X7 News

జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్ కార్డులలో మరింత జాప్యం..

TV4-24X7 News

Leave a Comment