సీతాపూర్, ఉత్తరప్రదేశ్: సీతాపూర్ జిల్లా లోధ్సా గ్రామం నుంచి వింత ఫిర్యాదు వెలుగులోకి వచ్చింది. స్థానికుడు మెరాజ్, తన భార్య నసీమున్ రాత్రిపూట పాములా మారి అతన్ని కాటాలని ప్రయత్నిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మెరాజ్ తెలిపిన వివరాల ప్రకారం, ఏ రాత్రి అయినా ఆమె దాడి చేసే అవకాశం ఉందని భయపడ్డాడు. ఈ ఫిర్యాదు సోషల్ మీడియాలో వైరల్ అయ్యడంతో, జిల్లా మెజిస్ట్రేట్ సీరియస్‌గా వ్యవహరించి, స్థానిక పోలీసులను దర్యాప్తుకు ఆదేశించారు.
ప్రాథమిక దర్యాప్తులో సంఘటన నిజమా, లేదో తెలుసుకోవడానికి పోలీసులు గ్రామంలో పరిశీలనలు చేపడుతున్నారు. ఈ విచిత్రమైన ఫిర్యాదు స్థానికులు మరియు నెటిజన్లలో చర్చనీయాంశంగా మారింది.

