తమిళనాడులో ఇటీవల జరిగిన దగ్గుమందు (Cough Syrup) విషప్రయోగ మరణాలపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఘటనలకు రాష్ట్ర అధికారుల నిర్లక్ష్యమే కారణమని కేంద్ర వర్గాలు స్పష్టం చేశాయి.
అనుమతులు ఇవ్వడం, ఉత్పత్తి నాణ్యత పర్యవేక్షణలో తమిళనాడు అధికారుల వైఫల్యం ఈ విషాదానికి దారితీసిందని పేర్కొన్నాయి. మందు తయారీ, పంపిణీ ప్రక్రియల్లో సరైన పరిశీలన జరగలేదని ఆరోపించాయి.
ఈ ఘటనపై కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పటికే నివేదిక కోరగా, దిగువ స్థాయి అధికారుల నిర్లక్ష్యంపై విచారణ జరపాలని ఆదేశించినట్లు సమాచారం. మరణించిన బాధితుల కుటుంబాలకు సాయం అందించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి.

