Tv424x7
National

దిగుమతులపై ఆధారపడొద్దు – దేశీయ పంటల సాగును పెంచండి:

ప్రధాని మోదీదేశం “వికసిత్‌ భారత్‌” (Viksit Bharat) వైపు అడుగులు వేయడంలో రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

గోధుమ, బియ్యం వంటి సాంప్రదాయ పంటలకే కాకుండా, పప్పు దినుసులు, ప్రోటీన్‌ పంటల వైపు దృష్టి సారించాలని రైతులకు సూచించారు.

దేశంలో పప్పు ధాన్యాల అవసరం పెరుగుతుండగా, వాటి ఉత్పత్తిలో తగ్గుదల కారణంగా దిగుమతులపై ఆధారపడే పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే దేశీయ ఉత్పత్తిని పెంచడం తప్పనిసరి అని మోదీ పేర్కొన్నారు.రైతులు పప్పు దినుసులు, నూనె గింజల సాగుపై దృష్టి పెట్టాలని కోరుతూ, ప్రభుత్వం వారికి అన్ని రకాల సాంకేతిక, ఆర్థిక సాయం అందిస్తుందని హామీ ఇచ్చారు.

Related posts

ఎలాన్ మస్క్‌ను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా లారీ ఎల్లిసన్..

TV4-24X7 News

సోషల్ మీడియా వేదికలకు కేంద్రం వార్నింగ్

TV4-24X7 News

కమలం పార్టీకి మహిళా సారథి.. రేసులో పురందేశ్వరి, నిర్మల!

TV4-24X7 News

Leave a Comment