Tv424x7
Andhrapradesh

అయ్యో ఎంత విషాదం.. ట్రైన్‌ కిందపడి కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్న వైనం…

కడప జిల్లా: కుటుంబ కలహాలతో భార్యాభర్తలు, ఏడాదిన్నర కుమారుడితో కలిసి గూడ్స్‌ ట్రైన్ కింద ఆత్మహత్య చేసుకోవడం ఒక తీవ్ర విషాదంగా మారింది. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో కడప-కృష్ణాపురం రైల్వే ట్రాక్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.

స్థానికులు గమనించి రైల్వే పోలీసులకు సమాచారం అందించడంతో, వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం కోసం రిమ్స్‌కి తరలించబడ్డారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతులు శంకరాపురానికి చెందిన శ్రీరాములు, భార్య శిరీష మరియు కుమారుడు రిత్విక్‌గా గుర్తించారు.

పోలీసులు మృతదేహాలపై ప్రారంభ దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు కారణం కుటుంబ కలహాలు మాత్రమేనా, లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పరిశీలనలు కొనసాగుతున్నాయి.

Related posts

ట్రాఫిక్‌లో మ‌హిళా నేత‌లు.. !వ‌న్ వే ట్రాఫిక్‌లో మ‌హిళా నేత‌లు.. !

TV4-24X7 News

యాచకురాలికి అన్నీ తామై అంత్యక్రియలు మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్

TV4-24X7 News

దువ్వూరులో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు

TV4-24X7 News

Leave a Comment