Tv424x7
Crime NewsTelangana

భర్తను ఇటుకతో చంపిన భార్య – కన్నకొడుకు ఎదుటే దారుణం

📍 రంగారెడ్డి జిల్లా, కేశంపేట మండలంరంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కేంద్రంలో శనివారం రాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. మాధవి అనే మహిళ తన భర్త కుమార్ (35)ను కన్నకొడుకు ఎదుటే సిమెంట్ ఇటుకతో తలపై కొట్టి హత్య చేసింది.

పోలీసుల సమాచారం ప్రకారం – కుమార్ తరచూ మద్యం సేవించి భార్యను వేధించేవాడట. ఈ వేధింపులకు విసిగి మాధవి తీవ్ర ఆవేశంతో హత్యకు పాల్పడిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

మద్యం మత్తులో గొడవపడి నిద్రించిన కుమార్‌పై మాధవి దాడి చేయగా, అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం మృతదేహాన్ని ఇంటి పక్కనే నిర్మాణంలో ఉన్న సంపులో పడేసి మాధవి తిరిగి ఇంటికొచ్చింది.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. భర్త సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మాధవిని అదుపులోకి తీసుకున్నారు.

Related posts

మహిళను కాళ్లు చేతులు, కట్టి హత్య….

TV4-24X7 News

గాంధీ హాస్పిటల్లో ఒక్క నెలలోనే 48 మంది పసిపిల్లల్ని, 14 మంది తల్లులను పొట్టనపెట్టుకున్న వైద్యుల నిర్లక్ష్యం

TV4-24X7 News

రేవంత్‌… చంద్రబాబులా పాలించు

TV4-24X7 News

Leave a Comment