Tv424x7
Andhrapradesh

ఆంధ్రప్రదేశ్ తాజా వాతావరణ హెచ్చరిక

కోస్తా ఆంధ్రా పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుకుగా ఉన్నాయి.

వర్ష సూచన:రాబోయే 24 గంటల్లో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఉత్తర, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.

ఆరెంజ్ అలర్ట్ జిల్లాలు:ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, పల్నాడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది.

ఈ జిల్లాల్లో భారీ లేదా చాలా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

నైరుతి రుతుపవనాలు నిష్క్రమించి, ఈశాన్య రుతుపవనాలు త్వరలో ప్రవేశించేందుకు వాతావరణం అనుకూలంగా ఉందని వాతావరణ విభాగం తెలిపింది.

Related posts

నేటి నుంచి కాకినాడ జిల్లాలో పర్యటించనున్న పవన్

TV4-24X7 News

బ్రహ్మంగారిమఠంలో భూ ప్రక్షాళన యజ్ఞం ప్రారంభం

TV4-24X7 News

చౌక ధరల దుకాణదారుడిపై కేసు నమోదు!!

TV4-24X7 News

Leave a Comment