Tv424x7
Andhrapradesh

బ్రహ్మంగారిమఠంలో భూ ప్రక్షాళన యజ్ఞం ప్రారంభం

14 వేల ఎకరాల ఆక్రమణలపై సర్వేకు శ్రీకారం పెట్టిన ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్

కడప /బ్రహ్మంగారిమఠం మండలంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలను గుర్తించి పేదలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ భూ ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఆర్డీవో చంద్రమోహన్, స్పెషల్ ఆఫీసర్ శిరీష, తహసిల్దార్ కార్తీక్, వీఆర్వోలు, వీఆర్ఏలు పాల్గొన్నారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ—“ప్రభుత్వ భూములు ఎవరి స్వంతమూ కావు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇచ్చిన భూములను ఆక్రమించిన వారిపై ఎటువంటి ఉపేక్ష ఉండదు” అన్నారు.మండలంలో సుమారు 14 వేల ఎకరాల భూభాగం ఆక్రమణల్లో ఉన్నట్లు ప్రాథమిక లెక్కల ద్వారా తెలిసినట్లు ఆయన తెలిపారు. ప్రతి గ్రామానికి ఒక వీఆర్వో, ఒక సర్వేయర్, ఒక వీఆర్ఏతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.అక్రమాలపై పోలిటికల్ ప్రెషర్ ఉన్నా వెనక్కి తగ్గేది లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.“ఇది రాజకీయ కార్యక్రమం కాదు. పేదల జీవనాధార యజ్ఞం” అని పుట్టా సుధాకర్ యాదవ్ పేర్కొన్నారు.మండల ప్రజలు ఈ చర్యను స్వాగతిస్తూ నిజమైన భూముల పంపిణీకి మార్గం సుగమం అవుతుందని అభిప్రాయపడుతున్నారు.

Related posts

సత్యవేడు రౌడీషీటర్లపై సిఐ మురళి నాయుడు, ఎస్ఐ రామస్వామి చర్యలు!!

TV4-24X7 News

ఏకాదశి సందర్భంగా కార్తీక దీపాలు వెలిగించిన వివేకానంద ట్యూషన్ విద్యార్థులు

TV4-24X7 News

వైకాపా సర్పంచ్ టిడిపి లో చేరిక

TV4-24X7 News

Leave a Comment