Tv424x7
Andhrapradesh

వైసీపీ విద్యార్థి విభాగం నాయకుడిని డ్రగ్స్ కేసులో అరెస్ట్

విశాఖపట్నం: నగరంలో డ్రగ్స్ రవాణా కేసులో వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పులగం కొండారెడ్డి సహా ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు నుండి ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్‌ను రైలులో తీసుకొచ్చి విశాఖలో యువతకు విక్రయించేందుకు ప్రయత్నించినట్లు ఎస్బీ విభాగం దర్యాప్తులో బయటపడింది.సంబంధిత స‌మాచారం ఆధారంగా రైల్వే స్టేషన్ పరిసరాల్లో ప్రత్యేక నిఘా నిర్వహించిన పోలీసులు, అనుమానాస్పదంగా కదులుతున్న ముగ్గురిని తనిఖీ చేయగా 48 ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్ స్వాధీనం చేసుకున్నారు. తొలి విచారణలో డ్రగ్స్‌ను బెంగళూరు ఆధారిత సరఫరాదారుల ద్వారా కొనుగోలు చేసి, నగరంలో విద్యార్థులకు విక్రయించేందుకు చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.అరెస్టైన వారిని రిమాండ్‌కు తరలించి, డ్రగ్స్ సరఫరా మార్గాలు, ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తును మరింతగా విస్తరించినట్లు స్పష్టమైంది. ఈ సంఘటనపై పార్టీ నేతల నుంచి అధికారిక స్పందన ఇంకా వెలువడలేదు. విద్యార్థుల్లో డ్రగ్స్ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో, ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Related posts

బ్యాంకు లాకర్ లో ఉండవలసిన అభరణాలు ఈవో ఇంట్లో!!

TV4-24X7 News

ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట

TV4-24X7 News

న్యాయం చేయాలని పెనుకొండ ఎమ్మెల్యే!!

TV4-24X7 News

Leave a Comment