Tv424x7
National

ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం…

📍దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈరోజు ఉదయం 7 గంటలకు ఏక్యూ ఐ (AQI) 347గా నమోదైంది.

సుప్రీం కోర్టు గ్రీన్ క్రాకర్లకు మాత్రమే అనుమతి ఇచ్చినప్పటికీ, టపాసుల దుమ్ము, వాహనాల పొగ కారణంగా కాలుష్యం మరింత పెరిగింది.

గత ఏడాది ఇదే సమయంలో ఏక్యూ ఐ 296గా ఉండగా, ఈసారి తీవ్రత మరింత పెరగటం ఆందోళన కలిగిస్తోంది.

సోమవారం సాయంత్రం 4 గంటలకే ఏక్యూ ఐ 345గా ‘వెరీ పూర్’ కేటగిరీలో ఉండగా, టపాసుల మోతతో గాలి నాణ్యత మరింత క్షీణించింది.

ప్రజలు మాస్కులు ధరించాలని, పిల్లలు మరియు వృద్ధులు బయటకు వెళ్లకుండా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

వాతావరణ శాఖ రాబోయే రోజుల్లో గాలి మరింత మందగించవచ్చని హెచ్చరిక జారీ చేసింది.

Related posts

గూగుల్ మ్యాప్స్ చెప్పినట్టే వెళితే… వరద నీటిలో మునిగిన కారు!

TV4-24X7 News

భారత నేవీ చేతికి మరో బ్రహ్మాస్త్రం.. _ త్వరలో చేరనున్న రాఫెల్‌ మెరైన్‌ ఫైటర్‌ జెట్స్..

TV4-24X7 News

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకం ‘స్టాగ్ బీటిల్’ — ఎంతో తెలుసా…?

TV4-24X7 News

Leave a Comment