తెలంగాణలో 2026 మార్చిలో జరగనున్న 10వ తరగతి (SSC) పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ఫీజు చెల్లింపు గడువులను రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది.
రెగ్యులర్ విద్యార్థులతో పాటు, గతంలో ఫెయిల్ అయిన వారందరికీ ఈ గడువులు వర్తిస్తాయని డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ (DGE) స్పష్టం చేసింది.
లేట్ ఫీజు లేకుండా:
అక్టోబర్ 30, 2025 – నవంబర్ 13, 2025 వరకు విద్యార్థులు ఫీజు చెల్లించవచ్చు.
పాఠశాల హెడ్ మాస్టర్లు (HMలు) సేకరించిన మొత్తాన్ని నవంబర్ 14 లోపు ట్రెజరీకి సమర్పించాలి.
ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు హెచ్‌ఎంలకు నవంబర్ 18 వరకు గడువు ఇవ్వబడింది.
లేట్ ఫీజు గడువులు:
రూ. 50 లేట్ ఫీజుతో – నవంబర్ 15 నుంచి నవంబర్ 25 వరకు
రూ. 200 లేట్ ఫీజుతో – నవంబర్ 29 నుంచి డిసెంబర్ 12 వరకు
రూ. 500 లేట్ ఫీజుతో – డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ 29 వరకు
డీజీఈ కార్యాలయం ఈ గడువులను ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించబోమని స్పష్టం చేసింది.
ఫీజు వివరాలు:అన్ని సబ్జెక్టులకు – ₹125మూడు సబ్జెక్టుల వరకు – ₹110మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులు ఉంటే – ₹110 + ప్రతి అదనపు సబ్జెక్టుకు ₹60
ఈ ఫీజు నిబంధనలు SSC / OSSC / వొకేషనల్ కోర్సుల విద్యార్థులందరికీ వర్తిస్తాయి.
విద్యార్థులు గడువు లోపు ఫీజు చెల్లించకపోతే, లేట్ ఫీజుతోనే దరఖాస్తు చేయాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరించారు.
విద్యార్థులు, పాఠశాలలు సమయానికి ఫీజు చెల్లించి పరీక్షల ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని సూచించారు.
మీ సమీపంలోని సమస్యలు మాకు పంపాలనుకుంటే మా మొబైల్ నెంబర్ : 8686186039

