హైదరాబాద్, నవంబర్ 03:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర చర్యలు ప్రారంభించింది. ప్రమాదంపై స్వయంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తూ, ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.ముఖ్యమంత్రి ఆర్టీసీ ఎండీ, రవాణా కమిషనర్, ఫైర్ డీజీలను ఘటనా స్థలానికి వెళ్లి రక్షణ, సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే హైదరాబాద్ గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులకు తరలించి అత్యవసర వైద్య సేవలు అందించాలన్న సూచనలు చేశారు.అదనంగా, వైద్య బృందాలను పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంచాలని, హెల్త్ ఎమర్జెన్సీ తరహాలో చికిత్స అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర సచివాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రమాదానికి సంబంధించిన సమాచారం, క్షతగాత్రుల వివరాలు తెలుసుకోవడానికి ఈ నంబర్లు అందుబాటులో ఉన్నాయి —📞 9912919545, 9440854433
previous post
next post

