Tv424x7
Andhrapradesh

తిరుమలకు రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

తిరుపతి:భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 20, 21 తేదీల్లో రెండు రోజుల పర్యటనలో భాగంగా తిరుచానూరు, తిరుమలను సందర్శించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా ఆమె తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని మరియు తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోనున్నారు.తెలుసుకున్న వివరాల ప్రకారం, నవంబర్ 20న రాష్ట్రపతి ముందుగా తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి వెళ్తారు. అక్కడ ప్రత్యేక దర్శన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం తిరుమలకు చేరుకుంటారు.నవంబర్ 21న ఉదయం ఆలయ సంప్రదాయం ప్రకారం ముందుగా శ్రీ వరాహస్వామి వారిని దర్శించి, అనంతరం శ్రీవారిని తీర్థప్రసాదాలతో సహా దర్శించుకోనున్నారు.రాష్ట్రపతి పర్యటనను దృష్టిలో ఉంచుకుని టీటీడీ అధికారులు ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టారు. గురువారం తిరుమలలోని పద్మావతి విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఈ సమావేశానికి టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి అధ్యక్షత వహించగా, సీవీఎస్వో మురళీకృష్ణ సహా పలు శాఖలాధిపతులు పాల్గొన్నారు.పర్యటన సమయంలో భద్రత, వసతి, దर्शन ఏర్పాట్లు, వీఐపీ ప్రోటోకాల్ తదితర అంశాలపై అధికారులు చర్చించారు. ఎలాంటి లోపాలు లేకుండా అత్యున్నత స్థాయి ఏర్పాట్లు చేయాలని అదనపు ఈవో ఆదేశించారు.

Related posts

భర్త ఆత్మహత్య భార్య ఏమి చేసిందో తెలుసా..?

TV4-24X7 News

విల్లూరి భాస్కరరావు ఆధ్వర్యంలో 35వ వార్డు లో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు

TV4-24X7 News

ఈనెల 22 నుంచే దసరా సెలవులు…

TV4-24X7 News

Leave a Comment