కడప / మైదుకూరు : జాతీయస్థాయి రెజ్లింగ్ అండర్ 14 విభాగానికి మైదుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యనిభ్యసిస్తున్న పాశం వెంకట నవీన్ అనే విద్యార్థి ఎంపికయ్యాడు. గుంటూరులో గురువారం జరిగిన రాష్ట్రస్థాయి రెజ్లింగ్ క్రీడా పోటీలలో నవీన్ ప్రతిభ కనపరచి బంగారు పతకం సాధించి జాతీయ స్థాయికి పోటీలకు ఎంపికైనట్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ మూడే రామ్ నాయక్ ,ఫాతిమాలు తెలిపారు .త్వరలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లో జరగనున్న జాతీయస్థాయి రెజ్లింగ్ క్రీడా పోటీలలో నవీన్ పాల్గొనున్నారు విద్యార్థి ఎంపికవడం పట్ల మండల విద్యాధికారి పద్మలత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఇలియాస్ అహ్మద్ ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేశారు
previous post

