కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గానికి చెందిన బ్రహ్మంగారి మండలం కొత్త బసాపురం గ్రామానికి చెందిన భూమిరెడ్డి బాలకృష్ణారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైదుకూరు నియోజకవర్గ స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.ఇటీవలి రోజుల్లో విజయవాడ, తాడేపల్లిలో నిర్వహించిన వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గ స్టూడెంట్ వింగ్ నాయకులతో పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బాలకృష్ణారెడ్డికి మైదుకూరు నియోజకవర్గ స్టూడెంట్ విభాగ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.ఈ సందర్భంగా భూమిరెడ్డి బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ—”మా అధినాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గారు, కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నాపై ఉంచిన విశ్వాసానికి న్యాయం చేస్తూ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తాను” అని చెప్పారు.అలాగే నియోజకవర్గం, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.
previous post

