Tv424x7
Andhrapradesh

ముస్లిం సోదరుల కబ్రస్తాన్‌కు స్థలం ప్రకటించిన ఎమ్మెల్యే

మైదుకూరు, మే 28:మైదుకూరు పట్టణ ముస్లిం మైనారిటీ సోదరుల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని కబ్రస్తాన్ (స్మశాన వాటిక) కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించనున్నట్లు మైదుకూరు ఎమ్మెల్యే శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ ప్రకటించారు.పండుగ పర్వదినం సందర్భంగా ఈ ప్రకటన చేయడంతో ముస్లిం మైనారిటీ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. పట్టణంలో పెరుగుతున్న జనాభా, భవిష్యత్తులో తలెత్తే అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, “రాబోయే రోజుల్లో స్మశాన వాటికల కొరత వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో స్థలం కేటాయిస్తున్నాం. మతసామరస్యం, సర్వమత సమానత్వానికి మైదుకూరు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది” అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఎమ్మెల్యే నిర్ణయాన్ని ముస్లిం మైనారిటీ పెద్దలు, యువకులు స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేశారు.

Related posts

లండన్‌లో వినాయక నిమర్జనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం

TV4-24X7 News

వచ్చే ఎన్నికల్లో నాకు టిక్కెట్ రాదని ప్రచారం చేస్తున్నారు.. అసత్య ప్రచారంతో శునకానందం పొందుతున్నారు :- మంత్రి రోజా

TV4-24X7 News

సేవ్ ఆర్డిటి.. కేంద్రంపై సిపిఐ ఆగ్రహం… ఎందుకో తెలుసా…

TV4-24X7 News

Leave a Comment