Tv424x7
Andhrapradesh

పొత్తులపై జనసేన కార్యకర్తలకు పవన్‌ కీలక సూచనలు

Pawan Kalyan: ..అమరావతి: జన హితం, రాష్ట్ర సమగ్రాభివృద్ధికే జనసేన ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకొని పొత్తుల దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు..ప్రస్తుతం పొత్తులకు సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయనీ.. ఈ దశలో పార్టీ నాయకులు భావోద్వేగాలతో ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని హితవు పలికారు. జనసేన విధానాలకు భిన్నమైన అభిప్రాయాలూ ప్రచారం చేయవద్దని కోరారు. ఇటువంటి ప్రకటనలతో రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించినవారు అవుతారని స్పష్టం చేశారు..అభిప్రాయాలు, సందేహాలు ఏమైనా ఉంటే జనసేన పార్టీ రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. తద్వారా కార్యకర్తల ఆలోచనలు పార్టీకి చేరుతాయన్నారు. అలాగే పొత్తులపై భిన్నంగా ప్రకటనలు చేసే వారి నుంచి వివరణ తీసుకోవాలని పార్టీ నాయకులను ఆదేశించానన్నారు..

Related posts

కొత్త వ్యక్తులు గ్రామాలలోకి వస్తే సమాచారం ఇవ్వండి

TV4-24X7 News

జగన్ అనర్హతపై అయ్యన్న, రఘురామ తాజా వ్యాఖ్యలు !

TV4-24X7 News

20న ఒకే వేదికపైకి చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌

TV4-24X7 News

Leave a Comment