తెలంగాణలోని 10 విశ్వవిద్యాలయాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంఛార్జి వైస్ ఛాన్స్లర్లను నియమించింది. వీసీలుగా.. సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమిస్తూ మంగళవారం రోజున సర్కారు అధికారిక ఆదేశాలు జారీ చేసింది. కాగా.. లిస్టులో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సతీమణి శైలజా రామయ్యర్ కూడా ఉన్నారు. సీనియర్ ఐఏఎస్ అయిన శైలజా రామయ్యర్‌ను పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాల యానికి వీసీగా ప్రభుత్వం నియమించింది. ఇక.. వివాదాస్పదంగా మారిన తెలంగాణ యూనివర్సిటీకి వీసీగా.. సందీప్ సుల్తానియాను నిమమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక.. ఐటీ పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జయేష్ రంజన్‌ను జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్ వర్సిటీకి వీసీగా నియమించింది రేవంత్ రెడ్డి సర్కార్..*కొత్తగా నియమితులైన వీసీలు వీరే…*ఉస్మానియా యూనివర్సిటీ- దాన కిషోర్తెలంగాణ యూనివర్సిటీ- సందీప్ సుల్తానియాపాలమూరు యూనివర్సిటీ- నదీం అహ్మద్కాకతీయ యూనివర్సిటీ- కరుణ వాకాటిపొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ- శైలజ రామయ్యర్జేఎన్టీయూ – బుర్రా వెంకటేశంమహాత్మాగాంధీ యూనివర్సిటీ- నవీన్ మిట్టల్శాతవాహన యూనివర్సిటీ- సురేంద్రమోహన్జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్ వర్సిటీ- జయేష్ రంజన్అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ- సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ…
previous post

