Tv424x7
Andhrapradesh

ట్రావెల్స్ బస్సు బోల్తా.. 20 మంది గాయాలు

పల్నాడు జిల్లా:జూన్ 01పల్నాడు జిల్లాలో ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటన శనివారం ఉదయం చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల వద్ద కామాక్షి ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టింది. కామాక్షి ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టిన తరుణంలోనే… బస్సులో ఉన్న 20 మందికి గాయాలు కాగా, ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు గుర్తించారు. ఈ సంఘటన జరిగిన వెంటనే పోలీసులు.. అక్కడి కి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాదు నుంచి ఒంగోలు కందుకూరు వెళ్తున్న సమయంలోనే కామాక్షి ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది…

Related posts

వరంగల్‌లో ఫారెస్ట్ బీట్ అధికారి సస్పెండ్… ఎందుకో తెలుసా..?

TV4-24X7 News

ప్రతి సమస్యకు పరిష్కారమే లక్ష్యం : టీడీపీ ఇంచార్జ్ బి.టెక్ రవి

TV4-24X7 News

దుల్హన్ పథకం అమలు

TV4-24X7 News

Leave a Comment