Tv424x7
Andhrapradesh

శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

అమరావతి :-శ్రీకాళహస్తీశ్వర స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఆలయ అధికారులు, అర్చకులు ఆహ్వానించారు. సచివాలయంలో సీఎంను కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వానపత్రికను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఆలయ కార్యనిర్వాహణాధికారి టి.బాపిరెడ్డి, ప్రధాన అర్చకులు అందించారు. ఈనెల 21వ తేదీ నుంచి మార్చి 6వ తేదీ వరకు శ్రీకాళహస్తిలో జరిగే బ్రహ్మోత్సవాలకు ముఖ్యఅతిథిగా రావాలని సీఎంను కోరారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు సీఎం చంద్రబాబుకు స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు. ఉత్సవ ఏర్పాట్లను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు.

Related posts

ఏపీ కో ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్స్ చైర్మన్ గా నియమితులైన గండి బాబ్జ కి అభినందనలు తెలిపిన రమేష్ లక్ష్మణ్ రెడ్డి కార్తీక్

TV4-24X7 News

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు కేబినెట్ సమావేశం

TV4-24X7 News

ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో అంతులేని నిర్లక్ష్యం.. విద్యార్థిని అదృశ్యం

TV4-24X7 News

Leave a Comment