ఏపీ రాష్ట్రంలో పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలను పెంచే దిశగా సాంకేతిక విద్యాశాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పాలిసెట్కు ఉచిత శిక్షణతో పాటు స్టడీ మెటీరియల్ను అందిస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ఉద్యోగ అవకాశాలతో కూడిన వాల్ పోస్టర్ను విడుదల చేసింది. దీని ద్వారా విస్తృత స్థాయిలో విద్యార్థుల్లో అవగాహన కల్పించనుంది.

