🔹విజయవంతం చేయాలని ఎమ్మెల్యే వరద పిలుపు
1983 సంవత్సరం నుండి ప్రతి ఏడాది తెలుగుదేశం పార్టీ సాంప్రదాయ ప్రకారం మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.ఈ ఏడాది కడప లో ఏర్పాటు చేస్తున్న మహానాడు బహిరంగ సభ 27,28,29 మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు.ప్రొద్దుటూరులో రేపు మినీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తెలిపారు ..జమ్మలమడుగు బైపాస్ రోడ్డు లోని భారత్ ఫంక్షన్ హాల్ దగ్గర ఏర్పాటు చేస్తున్న మినీ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు అభిమానులకు పార్టీ నాయకులకు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి పిలుపునిచ్చారు..

