Tv424x7
Andhrapradesh

సాక్షికేం సంబంధం లేదట – మరి ఎవరిది బాధ్యత ?

కొమ్మినేనిని అరెస్టు చేసి.. కృష్ణంరాజు కోసం పోలీసులు వేట సాగిస్తున్న సమయంలో సాక్షి మీడియా పూర్తిగా చేతులెత్తేసింది. అది వారిద్దరి మధ్య జరిగిన వ్యవహారం అని సాక్షి మీడియాకు ఏ సంబంధం లేదని వాదిస్తున్నారు. కొమ్మినేని ముసి ముసి నవ్వులు, ఖండించకపోవడం .. లాంటివి ఏమీ పట్టించుకోకుండా.. పూర్తిగా ఇద్దర్ని బలి పశువుల్ని చేసి సాక్షి మీడియా బయటపడాలనుకుంటోంది.ఆ వ్యాఖ్యలు పూర్తిగా కృష్ణంరాజు అనే వ్యక్తి వ్యక్తిగత వ్యాఖ్యలని.. వాటితో సాక్షి మీడియాకు సంబంధం లేదని.. పైగా తాము ఖండిస్తున్నామని కూడా చెప్పుకున్నారు. అంతేనా అసలు సాక్షి అలాంటి వాటిని ఎంకరేజ్ చేయదన్నారు. మరి డిబేట్ లో కొమ్మినేని దాన్ని ఖండించాల్సింది. కానీ ఖండించలేదు సరి కదా సమర్థించినట్లుగా మాట్లాడారు. వివాదం అయ్యే సరికి నాలుక మడతేశారు.ఈ కేసులో సాక్షి యాజమాన్యాన్ని ఏ-3గా చేర్చారు. ఓ కమ్యూనిటీని, ఓ ప్రాంత ప్రజల్ని అత్యంత ఘోరంగా కించపర్చిన విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. అందుకే సాక్షి యాజమాన్యం కూడా కంగారు పడుతోంది. తమకేం సంబంధం లేదని ఖండిస్తున్నామని చెబుతోంది. కావాలంటే వారిద్దర్నీ బలి చేస్తామని .. మమ్మల్ని వదిలేయాలన్నట్లుగా మాట్లాడుతోంది. కానీ సాక్షికి కాక ఇంకెవరికి సంబంధం ఉంటుంది ?

Related posts

ఏపీలో ఒక రోజు ముందుగానే పింఛన్ అందజేత

TV4-24X7 News

వ్యభిచారం నిర్వహిస్తున్న కానిస్టేబుల్ అరెస్టు..

TV4-24X7 News

అంగన్ వాడి వర్కర్ల సమ్మెపై ప్రభుత్వం వెంటనే స్పందించి వారి డిమాండ్లను నెరవేర్చాలి

TV4-24X7 News

Leave a Comment