Tv424x7
Andhrapradesh

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజీనామా.

Alla Ramakrishna Reddy: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాఅమరావతి: వైకాపాకు గట్టి షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తన పదవికి రాజీనామా చేశారు. వైకాపా సభ్యత్వానికీ రాజీనామా ఆయన చేసినట్లు తెలిపారు..ఎమ్మెల్యే పదవికి స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా చేసిన ఆర్కే.. స్పీకర్‌ కార్యాలయానికి వెళ్లి సభాపతి కార్యదర్శికి ఆ లేఖను అందజేశారు. మంగళగిరి వైకాపా ఇన్‌ఛార్జ్‌గా గంజి చిరంజీవికి ఆ పార్టీ బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలోనే ఆర్కే అసంతృప్తికి గురై రాజీనామా చేసినట్లు సమాచారం..రాజీనామా అనంతరం ఆర్కే మీడియాతో మాట్లాడారు. ”ఎమ్మెల్యే పదవికి, వైకాపాకు వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశా. స్పీకర్‌ కార్యాలయంలో లేఖను అందజేశాను. దీన్ని ఆమోదించాలని స్పీకర్‌ను కోరా. రాజీనామాకు గల కారణాలను త్వరలో తెలియజేస్తా”అని ఆయన చెప్పారు..

Related posts

ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త

TV4-24X7 News

గ్రామ సదస్సులో ప్రజలు విన్నవించిన ప్రతిఒక్క సమస్యను పరిష్కరిస్తాం. .!

TV4-24X7 News

భారీ విగ్రహాలు పెడితే కడుపు నిండదు.. గణతంత్ర వేడుకల్లో సర్కార్‌పై షర్మిల విసుర్లు

TV4-24X7 News

Leave a Comment