Tv424x7
Telangana

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన మాదాపురం ప్రభుత్వ పాఠశాల విద్యార్థి..

దేవరుప్పుల సెప్టెంబర్ 01,
జనగామ జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి కళాఉత్సవ్–2025 పోటీల్లో, మాదాపురం గ్రామానికి చెందిన జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాల 10వ తరగతి విద్యార్థి.శ్రీమంతోజు శివ సాయి అద్భుత ప్రతిభ కనబరిచాడు. శిల్పకళ విభాగంలో తన సృజనాత్మకతను ప్రదర్శించి,రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయ్యారు. ఇది పాఠశాలకు, గ్రామానికి గర్వకారణంగా నిలిచింది. విద్యార్థిని జిల్లా, మండల స్థాయి అధికారులు, ఉపాధ్యాయులు, సహచర విద్యార్థులు హర్షధ్వానాలతో అభినందించారు. రాబోయే రోజుల్లో కృషి, పట్టుదల, ప్రతిభతో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, పలువురు ఆకాంక్షించారు. గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు శివ సాయి కృషిని ప్రశంసిస్తూ.. రాష్ట్ర స్థాయిలోనూ విజయాన్ని సాధించి మాదాపురం పేరును నిలబెట్టాలన్నారు. కాగా గతంలో ఈ పాఠశాల నుండి ఐఐటీ బాసరతో పాటు పలు ఉన్నత పాఠశాలకు, కాలేజీలకు ఎంపిక అయినట్లు ప్రధానోపాధ్యాయుడు వి.రమేష్ అన్నారు.
ఈ విద్యాసంవత్సరంలోను విద్యార్థులను ఉన్నత స్థాయికి పంపించే ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రధానోపాధ్యాయుడు ధీమా వ్యక్తం చేశారు..

Related posts

మెట్రోలో 300 కోట్ల బెట్టింగ్ స్కాం అంటూ వీడియో చేసిన యూట్యూబర్

TV4-24X7 News

పెద్దమ్మ గుడి నుంచి ఎల్బీ స్టేడియానికి..

TV4-24X7 News

తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయనున్న భట్టి.

TV4-24X7 News

Leave a Comment