Tv424x7
Andhrapradesh

వేలం పాటలో పులస ఎంత రేటో తెలుసా…?

తింటే గోదావరి చేప తినాలి అంటారు. అందులో వర్షాల సీజన్‌లో పులస చేప తినాలి అంటారు చేప మాంసం ప్రియులు…పుస్తలు అమ్మి అయిన పులస తినాలి అంటారు మరికొందరు…ఏముందో దానిలో….

ఒకపక్క పులస 29 వేల రూపాయలు పలికితే, మరో పులస 28,000 రూపాయలు పలికింది.

యానం చేపల మార్కెట్ వేలం పాటలో 1.5 కేజీల పులస.. 29 వేల రూపాయలు పలికితే,1.4 కేజీల బరువు గల పులస 28,000 రూపాయలు పలికింది. ఇటీవల కాలంలో పులస చేపలు చాలా అరుదుగా దొరకడంతో పులస చేపల ధర ఆకాశాన్ని తాకింది. పులస ఇంత ధర పలకడానికి పులస రుచి ముందు మిగతా చేపలు రుచి దిగదుడిపే కారణం అంటున్నారు మాంసపు ప్రియులు.

చేపల్లో పులస రారాజు అయితే, ఆ తర్వాతి స్థానం పడుగప్ప చేపదే. ప్రోటీన్ అధికంగా ఉండే ఈ చేపలో ఒమేగా -3 ప్యాటీ యాసిడ్స్, విట మిన్ బి-12 వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

ఏది ఏమైనా ఒకపక్క వరద గోదావరి మరోపక్క పులసలు పండుగప్పల కోసం ఎదురుచూస్తున్నారు చేప ప్రియులు.

Related posts

జీవీఎంసీకి రాష్ట్ర స్థాయి అవార్డు

TV4-24X7 News

బ్రహ్మంగారిమఠంలో భూ ప్రక్షాళన యజ్ఞం ప్రారంభం

TV4-24X7 News

నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్

TV4-24X7 News

Leave a Comment