Tv424x7
Andhrapradesh

ఫేక్ న్యూస్ టార్గెట్‌లను భలే ఫిక్స్ చేస్తున్నారుగా !

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా ఫేక్ ప్రచారం చేయడానికి తొందరపడుతున్న వారిని అదే ట్రాప్ లోకి లాగి .. కఠిన చర్యలు తసుకోవడానికి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.ముందుగా ఓ వార్తను మీడియా ప్రతినిధులకు లీక్ చేస్తున్నారు. అయితే చెప్పాల్సినంత వరకే చెబుతున్నారు. మిగతాది ఫేక్ న్యూస్ హ్యాండిల్స్ ఊహించుకునేలా టెంప్ట్ చేస్తున్నారు. దాంతో వారు రెచ్చిపోతున్నారు. కానీ వెంటనే ఆ పోస్టులను రికార్డు చేసి.. ఫ్యాక్ట్ చెక్ చేసి.. ఇదిగో మీరు చర్యలు తీసుకోదగ్గ నేరం చేశారు అని గుర్తు చేస్తున్నారు.

ఏపీ ప్రభుత్వం కొత్తగా ఓ హెలికాఫ్టర్ అద్దెకు తీసుకుంది. పాత హెలికాఫ్టర్ స్థానంలో కొత్త హెలికాఫ్టర్ అద్దెకు తీసుకుంది. ప్రత్యేక విమానాల అవసరం లేకుండా అందులో రాష్ట్రమంతా పర్యటించవచ్చు. అయితే వెంటనే ప్రభుత్వంపై బురదచల్లాలనుకునే హ్యాండిల్స్.. ఏపీ ప్రభుత్వం హెలికాఫ్టర్ కొనేసిందని ఇష్టం వచ్చినట్లుగా రాసేశారు. అలాంటి హ్యాండిల్స్ అన్నింటినీ నమోదు చేసుకున్నారు. ఇలా ఇటీవల పలు అంశాల్లో ప్రభుత్వం ఇస్తున్న సమచారాన్ని వక్రీకరించడం, ఎక్కడో జరిగిన వాటిని ఏపీలో జరిగినట్లుగా చూపించడం వంటి ఫేక్ న్యూస్ పై ప్రభుత్వ వర్గాలు విరివిగా స్పందిస్తున్నాయి.

చంద్రబాబు కూడా ఈ అంశంలో సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. ఒక్కొక్కరిని కాకుండా.. ఇలా ఎక్కువగా ఫేక్ చేస్తున్న వారందర్నీ ఒకే సారి టార్గెట్ చేసేందుకు వ్యూహాత్మకంగానే ఇలా చేస్తున్నారని అంటున్నారు. కొన్ని హ్యాండిల్స్ విదేశాల నుంచి ఆపరేట్ చేస్తున్నారు. వారికి సంబంధించిన వివరాలన్నీ బయటకు తీసి..కేసులు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. చట్టం కూడా తీసుకు వచ్చే అవకాశం ఉన్నందున ఉద్దేశపూర్వకంగా ఫేక్ చేసేవారికి అసలైన సినిమా ముందు ఉందని..దానికి తగ్గ ట్రాప్ రెడీ చేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Related posts

ఆంధ్రప్రదేశ్ వాతావరణ సమాచారం

TV4-24X7 News

సిద్ధం’ సభలకు రూ.600 కోట్లు ఖర్చు: షర్మిల

TV4-24X7 News

వెనుక కూర్చున్నా హెల్మెట్ తప్పనిసరి ట్రాఫిక్ సిఐ షణ్ముఖరావు

TV4-24X7 News

Leave a Comment