గద్వాల జిల్లాలో బుధవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అయిజ మండలం భూంపురం గ్రామంలో పిడుగుపడి ముగ్గురు మృతి చెందారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఒక యువకుడు ఉన్నారు. మృతులు పార్వతమ్మ (22), సర్వేష్ (20), సౌభాగ్య(40)గా గుర్తించారు. మరో ఇద్దరికి గాయాలు కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో భూంపురం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
న్యూస్ సేకరణ : రజిత

