Tv424x7
Andhrapradesh

కడప జిల్లా – బద్వేలు పట్టణంలో పగటి పూటే దొంగతనం ( వీడియో )

బద్వేల్ మున్సిపాలిటీ వెంకటయ్య నగర్‌లో పగటిపూట దొంగతనం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. ఈ ఘటనలో సుమారు 12 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు ప్రారంభించారు. క్లూస్ టీమ్, ఫింగర్ ప్రింట్ నిపుణుల సహాయంతో ఆధారాలను సేకరిస్తున్నారు.ఈ దొంగతనంతో స్థానికులలో ఆందోళన వ్యక్తమవుతోంది. పగటిపూటే ఇలాంటి సంఘటనలు జరగడం పట్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను పట్టుకునేందుకు చర్యలు ప్రారంభించారు.

రిపోర్టర్ : వెంకటేష్ (బద్వేలు )

Related posts

పెన్షన్ పంపిన కార్యక్రమం లో పాల్గొన్న టీడీపీ నాయకులు బత్తిన నవీన్

TV4-24X7 News

నెల్లూరులో దొంగనోట్ల కలకలంరూ.10 లక్షలు లాక్కొని మోసం.. పోలీసు సిబ్బందిపై ఆరోపణలు

TV4-24X7 News

సినిమా డైలాగులు చెప్తే కఠిన చర్యలు: పవన్

TV4-24X7 News

Leave a Comment