Tv424x7
Andhrapradesh

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త నిర్ణయం…. ఏంటో తెలుసా

ఆంధ్రప్రదేశ్‌

అక్టోబర్‌ 2 నుంచి ఇంటికే కుల ధ్రువీకరణ పత్రంఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రజల సౌలభ్యం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కుల ధ్రువీకరణ పత్రం కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.

అక్టోబర్‌ 2 నుంచి ఇంటికే కుల ధ్రువీకరణ పత్రాలు అందజేయనుంది.ఇప్పటికే చాలామంది మొబైల్‌ ఫోన్లకు “మీరు ఇంటిగ్రేటెడ్‌ ధ్రువపత్రం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అది మాకు అందింది. సుమోటో విచారణ జరుగుతోంది. 25 రోజుల్లోపు పూర్తవుతుంది” అని మెసేజ్‌లు వస్తున్నాయి. దరఖాస్తు చేయకుండానే ఈ మెసేజ్ రావడంతో కొందరు ఆశ్చర్యపోయారు. అయితే ప్రభుత్వం గతంలో నిర్వహించిన కుటుంబ సర్వే వివరాల ఆధారంగానే ఈ ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.

🔹 వీఆర్‌వోలు ఇంటింటికీ వెళ్లి సర్వే చేసి అర్హులను గుర్తించారు.

🔹 చదువు, ఉపకార వేతనాలు, ఉద్యోగాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం ఈ ధ్రువీకరణ పత్రం ఉపయోగపడనుంది.

🔹 ప్రజల శ్రమ, డబ్బు, సమయం ఆదా కావడమే కాకుండా అవినీతి అవకాశాలు కూడా తగ్గనున్నాయని రెవెన్యూ శాఖ భావిస్తోంది.

➡️ ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ సేవలు నేరుగా ఇంటికే అందే విధానంలో ఇది మరో ముందడుగు అని అధికారులు తెలిపారు.

అనూష

Related posts

పీతల మూర్తి ఆరోపణలు అవాస్తవం -స్పష్టం చేసిన రైతులు

TV4-24X7 News

టిడిపికి చెందిన ముఖ్య నాయకులు మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిక.

TV4-24X7 News

ఏపీ మహిళామణులకు శుభవార్త

TV4-24X7 News

Leave a Comment