Tv424x7
Andhrapradesh

నిండుగా ప్రవహిస్తున్న నీలాపురం వంక – తండా రాకపోకలకు అడ్డంకి

కడప / దువ్వూరు, సెప్టెంబర్ 11 (tv4 24×7 ప్రతినిధి):గురువారం కురిసిన భారీ వర్షంతో దువ్వూరు మండల పరిధిలోని నీలాపురం గ్రామం వద్ద వంక నిండుగా ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. ఫలితంగా గ్రామం నుంచి తండాకు వెళ్లే మార్గం పూర్తిగా మూసుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి.రైతులు తమ పొలాలకు వెళ్లడానికి తప్పనిసరిగా ఈ వంక దాటుకోవాల్సి ఉంటుంది. అయితే వర్షం పడిన ప్రతిసారీ వంక ఉప్పొంగిపోవడం వల్ల గ్రామ రైతులు, తాండా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.”వంక మీద కల్వర్టు నిర్మాణం కోసం మేము ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాం. కానీ ఏ ప్రభుత్వమూ ఈ సమస్య పరిష్కరించలేదు” అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తండాకు వెళ్ళే రహదారి సరిగా లేకపోవడం వలన వర్షాకాలంలో జీవన విధానం మరింత కష్టసాధ్యమవుతోందని వారు తెలిపారు.ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ వెంటనే స్పందించి వంక మీద కల్వర్టు, గ్రామం నుంచి తండా వరకు రోడ్డు నిర్మాణ పనులు చేపడితే తమకు ఎంతో మేలు జరుగుతుందని రైతులు, తాండావాసులు కోరుతున్నారు.

Related posts

మన్మోహన్‌సింగ్‌ మృతి పట్ల ఏపీ మంత్రి లోకేశ్‌ సంతాపం

TV4-24X7 News

భార్య మృతదేహాన్ని కావడి పై స్వగ్రామం తరలించిన భర్త

TV4-24X7 News

వైసీపీ గూటికి యనమల కృష్ణుడు?

TV4-24X7 News

Leave a Comment