ఆదిలాబాద్ జిల్లా – నార్నూర్ మండలం
కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఆహారంలో పురుగులు కలిసిన ఘటన విద్యార్థినుల్లో ఆగ్రహాన్ని రేపింది.
ఉదయం టిఫిన్‌గా ఇచ్చిన పులిహోరలో పురుగులు కనిపించడంతో విద్యార్థినులు తినకుండా తరగతులకే వెళ్లారు. అయితే తరువాత వండిన ఉప్మాలో కూడా పురుగులు రావడంతో ఆగ్రహంతో పాఠశాల ముందు బహిరంగ ఆందోళనకు దిగారు.
విద్యార్థినులు నినాదాలు చేస్తూ “మాకు శుభ్రమైన ఆహారం ఇవ్వాలి” అని డిమాండ్ చేశారు.
➡️ తల్లిదండ్రులు కూడా పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యాన్ని తప్పుపడుతున్నారు.
➡️ ఈ ఘటనపై విద్యాశాఖ అధికారుల స్పందన కోసం ఎదురుచూస్తున్నారు.
📢 ఆదిలాబాద్ జిల్లాలో కస్తూర్బా పాఠశాల ఆహారంపై విద్యార్థినుల ఆందోళనతో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

