Tv424x7
National

మంచి మనసు చాటుకున్న రాఘవ లారెన్స్…

చెన్నై :

సినీ నటుడు, డాన్స్ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ మరోసారి తన సదాశయాన్ని చాటుకున్నారు. చెన్నై రైళ్లలో స్వీట్స్ అమ్ముతూ జీవనోపాధి సాగిస్తున్న 80 ఏళ్ల వృద్ధుడు, ఆయన భార్యకు ఆర్థిక సాయం చేయాలని ముందుకొచ్చారు.

ఈ విషయాన్ని X (ట్విట్టర్)లో పంచుకున్న లారెన్స్… వృద్ధుడి ఫోటోను షేర్ చేస్తూ— “ఆయన ఎవరన్నది ఎవరికైనా తెలిస్తే వివరాలు చెప్పండి. నేను రూ.1 లక్ష సాయం అందిస్తాను.

రైలులో ఆయనను చూసిన వారు తప్పకుండా స్వీట్స్ కొనుగోలు చేసి సహాయం చేయండి” అని కోరారు.అయితే, ఫోటోలో ఉన్న కాంటాక్ట్ నంబర్‌కు కాల్ చేస్తే కనెక్ట్ అవ్వడం లేదని కూడా లారెన్స్ తెలిపారు.

లారెన్స్ చూపించిన ఈ మంచి మనసు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రశంసలు అందుకుంటోంది.

అనూష

Related posts

సిక్కింలో హిమపాతం.. 1,217 మందిని రక్షించిన ఆర్మీ

TV4-24X7 News

సింగపూర్ కరోనా కలకలం

TV4-24X7 News

త్వరలోనే హమాస్‌ – ఇజ్రాయెల్‌ యుద్ధం ముగింపు..?

TV4-24X7 News

Leave a Comment