తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్–1 పరీక్షలపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తాజా తీర్పుపై అప్పీల్ చేయాలని నిర్ణయించింది.
సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్‌లో సవాల్ చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయించుకుంది.
ఈరోజు న్యాయ నిపుణులు, ప్రభుత్వ అధికారులతో సమావేశం అనంతరం అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్లే ఆలోచనలో కూడా టీజీపీఎస్సీ ఉన్నట్టు సమాచారం.

