🌧️
తెలుగు రాష్ట్రాల్లో వర్షాల ప్రభావం కొనసాగుతోంది.
ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని APSDMA హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
అలాగే తెలంగాణలో ఆసిఫాబాద్, మంచిర్యాల, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
👉 గ్రామీణ ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లే ప్రమాదం ఉండేందున జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

