కారకస్: వెనెజువెలాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. టాచిరా రాష్ట్రంలోని పరమిల్లో ఎయిర్‌పోర్ట్‌లో ఒక చిన్న విమానం టేకాఫ్ అవుతుండగా కుప్పకూలింది. రన్‌వే నుంచి ఎగరగానే విమానం గాలిలో గింగిరాలు తిరుగుతూ కిందపడిపోయింది.దీంతో విమానం పూర్తిగా మంటలతో ఆవరించగా, అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఈ ఘటనపై వైమానిక అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

