Tv424x7
Andhrapradesh

జమ్మలమడుగులో వినాయక లడ్డూ పై వైఎస్ జగన్ పేరు ప్రతిష్టాత్మకం..

వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఏర్పాటు చేసిన వినాయక మండపంలో లడ్డూ వేలం పోటీ ఘనంగా జరిగింది. ఈ వేలంలో లడ్డూ పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు దక్కించుకోవడం విశేషంగా నిలిచింది.

తరువాత, ఈరోజు తాడేపల్లి కార్యాలయంలో వైఎస్సార్ జిల్లా మున్సిపల్ విభాగం అధ్యక్షులు శ్రీ వల్లంబాయి హృషికేశ్వర రెడ్డి గారు తన మిత్రబృందం ఆధ్వర్యంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని కలుసుకొని లడ్డూ ప్రసాదాన్ని అందించారు.

ఈ సందర్భంగా హృషికేశ్వర రెడ్డి గారు, వినాయకుడి కృపతో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, ముఖ్యమంత్రి జగన్ ప్రజా సేవలో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Related posts

సంగారెడ్డి జైలులో గంజాయి దొరక్క ఖైదీల వీరంగం!!

TV4-24X7 News

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం..

TV4-24X7 News

ప్రాథమిక పాఠశాలకు విద్యార్థులు వెళ్లేందుకు వీలు లేకుండా దారికి అడ్డుగా కంప

TV4-24X7 News

Leave a Comment