Tv424x7
Andhrapradesh

జిల్లాలో ఉల్లి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.

రైతులు సద్వినియోగం చేసుకోవాలి – ఇంచార్జి కలెక్టర్ అదితి సింగ్

కడప జిల్లా:
జిల్లాలో ఉల్లి పంటను ప్రభుత్వం నేరుగా రైతుల నుండి కొనుగోలు చేస్తోందని జిల్లా ఇంచార్జి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ శ్రీమతి అదితి సింగ్ తెలిపారు. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఇప్పటికే మైదుకూరు, కమలాపురం నియోజకవర్గాల్లో ఉల్లి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించబడ్డాయని ఆమె గురువారం కలెక్టరేట్‌ ఛాంబర్‌లో ఉద్యాన, మార్క్‌ఫెడ్‌ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వెల్లడించారు.

ఒక క్వింటాల్ ఉల్లి ధర రూ.1200/- చెల్లింపుతో, e-Crop నమోదు చేసిన రైతుల నుండి పంటను కొనుగోలు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా, నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పకడ్బందీగా కొనుగోలు జరుగుతోందని ఆమె స్పష్టం చేశారు.

జిల్లాలో ఉల్లి పండించిన ప్రతి రైతు ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకోవాలని పిలుపునిచ్చిన కలెక్టర్, అధికారులు రైతులకు అవగాహన కల్పించి, ప్రభుత్వం అందిస్తున్న ఈ సహకారం ప్రతి రైతుకు చేరేలా చూడాలని ఆదేశించారు.

Related posts

డిప్యూటీ సిఎం, పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మహా యజ్ఞం

TV4-24X7 News

రెండు సార్లు అధికారమిస్తే.. ప్రాజెక్టుల పేరుతో దోచుకున్నారు: రేవంత్‌రెడ్డి

TV4-24X7 News

ఏపీలో గ్రామీణ రహదారుపై ప్రభుత్వం సంచలన నిర్ణయం

TV4-24X7 News

Leave a Comment