రైతులు సద్వినియోగం చేసుకోవాలి – ఇంచార్జి కలెక్టర్ అదితి సింగ్
కడప జిల్లా:
జిల్లాలో ఉల్లి పంటను ప్రభుత్వం నేరుగా రైతుల నుండి కొనుగోలు చేస్తోందని జిల్లా ఇంచార్జి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ శ్రీమతి అదితి సింగ్ తెలిపారు. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఇప్పటికే మైదుకూరు, కమలాపురం నియోజకవర్గాల్లో ఉల్లి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించబడ్డాయని ఆమె గురువారం కలెక్టరేట్ ఛాంబర్‌లో ఉద్యాన, మార్క్‌ఫెడ్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వెల్లడించారు.
ఒక క్వింటాల్ ఉల్లి ధర రూ.1200/- చెల్లింపుతో, e-Crop నమోదు చేసిన రైతుల నుండి పంటను కొనుగోలు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా, నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పకడ్బందీగా కొనుగోలు జరుగుతోందని ఆమె స్పష్టం చేశారు.
జిల్లాలో ఉల్లి పండించిన ప్రతి రైతు ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకోవాలని పిలుపునిచ్చిన కలెక్టర్, అధికారులు రైతులకు అవగాహన కల్పించి, ప్రభుత్వం అందిస్తున్న ఈ సహకారం ప్రతి రైతుకు చేరేలా చూడాలని ఆదేశించారు.

