Tv424x7
Andhrapradesh

కొడుకు లేని లోటు ఆ తల్లికి రానివ్వం..

నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు జగ్గారపు సంజయ్ ప్రమాదవశాత్తు మరణించారు. ఈ సందర్భంలో జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారి కుటుంబానికి అండగా నిలుస్తూ ₹5 లక్షల బీమా చెక్కు పంపించారు.

ఆ చెక్కును ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య, సమన్వయకర్త తోట రాజా రమేష్ తదితరులు సంజయ్ కుటుంబానికి అందజేశారు.

ఈ సందర్భంగా క్రియా వాలంటీర్ మండలనేని చరణ్ తేజ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా పంపిన లేఖను చదివి వినిపించారు. కార్యక్రమంలో జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ శిఖా బాలు, జిల్లా కార్యదర్శి చట్టాల త్రినాథ్, జిల్లా సంయుక్త కార్యదర్శి సుభాని, పట్టణ అధ్యక్షులు మునీర్ హాసన్, చిలకలూరిపేట AMC డైరెక్టర్ ఆమదాల లీలా కిషోర్, నాదెండ్ల మండల అధ్యక్షులు శరత్ మరియు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Related posts

మృత శిశువుకు రెడ్ క్రాస్ అంత్యక్రియలు

TV4-24X7 News

స్వర్ణాంధ్ర @ 2047 విజన్ లక్ష్యాలతో 20 సూత్రాల కార్యక్రమం అమలు

TV4-24X7 News

ఢిల్లీ జగన్ ధర్నాలో పాల్గొన్న వాసుపల్లి గణేష్ కుమార్

TV4-24X7 News

Leave a Comment