Tv424x7
Telangana

40 లక్షల దోపిడీ కేసులో పోలీసులు సంచలన విచారణ వివరాలు…!

హైదరాబాద్‌ శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనంగా మారిన, రూ.40 లక్షల దారి దోపిడీ కేసులో నిందితులను పోలీసులు స్వల్ప వ్యవధిలోనే పట్టుకోవడం కలకలం రేపుతోంది.

🔸 స్టీల్ వ్యాపారి రాకేశ్ అగర్వాల్‌ డ్రైవర్ మధునే ఈ దోపిడీకి ప్రధాన సూత్రధారి అని పోలీసులు నిర్ధారించారు.

🔸 వ్యాపారి డబ్బు వసూలు చేయడానికి వికారాబాద్‌కు పంపిన మధు, సహాయకుడు సాయిబాబా దగ్గరే ప్లాన్‌ మార్చి స్నేహితులతో కలిసి దోపిడీ జరిపించాడు.

🔸 మొత్తం ఏడుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

🔸 దోపిడీకి ఉపయోగించిన వాహనం, సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కేసును గంటల వ్యవధిలోనే ఛేదించి నిందితులను పట్టుకున్న శంకర్పల్లి పోలీసులు తమ చాకచక్యాన్ని మరోసారి చాటారు.

అనూష

Related posts

తెలంగాణలో వాహనాల పెరుగుదల రికార్డు – రోడ్లపై 1.77 కోట్ల వాహనాలు!

TV4-24X7 News

తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు ..

TV4-24X7 News

ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ అత్యవసర సమావేశం!

TV4-24X7 News

Leave a Comment