Tv424x7
Andhrapradesh

తిరుపతిలో కిడ్నాప్ కలకలం…

తిరుపతి నగరంలో ఇద్దరు మహిళలను కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపింది.లక్ష్మీపురం సర్కిల్‌లో జిమ్ నిర్వహిస్తున్న అజీమ్‌ ఈ ఘటనకు కారణమయ్యాడు.

వివరాల్లోకి వెళ్తే—నారాయణపురానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న అజీమ్, ఆ విషయం భర్తకు చెబుతానని బెదిరించి తన వశం చేసుకునే ప్రయత్నం చేశాడు.రెండు రోజుల క్రితం మహిళను తన జిమ్ వద్దకు రమ్మని, లేకపోతే పిల్లలను చంపేస్తానని హెచ్చరించాడు.నిన్న తల్లితో కలిసి వెళ్లిన సమయంలో ఇద్దరినీ కిడ్నాప్ చేశాడు.

తప్పించుకునే క్రమంలో రెండు కార్లు, ద్విచక్ర వాహనాలను ఢీకొట్టి పారిపోవడానికి ప్రయత్నించిన అజీమ్‌ను సినీ బైపాస్ రోడ్ వద్ద నైట్ పెట్రోలింగ్ పోలీసులు వెంటాడారు.

అలిపిరి సీఐ రామ్ కిషోర్ నేతృత్వంలో కారును చేజ్ చేసి అదుపులోకి తీసుకున్నారు.

భర్త ఫిర్యాదు, మొబైల్ లైవ్ లొకేషన్ ఆధారంగా నిందితుడ్ని పోలీసులు పట్టుకోవడంలో విజయవంతమయ్యారు.

Related posts

చిన్నసింగనపల్లి గ్రామంలో 40 కుటుంబాలు టీడీపీ పార్టీ లోకి చేరిక

TV4-24X7 News

కాపు కార్పొరేషన్ ఛైర్మెన్ రాయలసీమ బలిజలకు ఇవ్వాలి మంత్రికి బలిజసేన అభ్యర్థన

TV4-24X7 News

కడపజిల్లాలో ఇంటెలిజెన్స్ సీఐ పై దాడి ఘటనలో ఇరువర్గాలపై కేసు

TV4-24X7 News

Leave a Comment