Tv424x7
Andhrapradesh

వైస్సార్సీపీ విద్యార్థి విభాగం డిమాండ్లు… ఏంటో తెలుసా…?

వైస్సార్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకట రామిరెడ్డి సూచనల మేరకు – విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో హాస్టల్ సమస్యలపై ఆందోళనఅనంతపురం అర్బన్‌లో విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్ నేతృత్వంలో ప్రభుత్వ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలపై డిఆర్ఓ మలోలా కి వినతిపత్రం అందజేశారు.

విద్యార్థి విభాగం ప్రధాన ఆందోళనలు

నాణ్యమైన ఆహారం లేకపోవడం

మందుల కొరత,

ఎమర్జెన్సీ మెడిసిన్ అందుబాటులో లేకపోవడం

శానిటేషన్ లోపం, శుభ్రమైన నీరు, సరైన గాలి ప్రవాహం లేకపోవడందోమతేరలు లేకపోవడం, అధిక జనసాంద్రతచర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు, శ్వాస సమస్యలు, డయేరియా, మలేరియా, టైఫాయిడ్ వ్యాప్తి.

వైస్సార్సీపీ విద్యార్థి విభాగం డిమాండ్లుప్రతి నెల రెండు సార్లు ప్రభుత్వ హాస్టళ్లలో హెల్త్ క్యాంపులు నిర్వహించాలి, ఐరన్ టాబ్లెట్స్ పంపిణీ చేయాలి

సీజనల్ వ్యాధులను అరికట్టడానికి ప్రత్యేక వైద్య సిబ్బందిని నియమించాలిప్రతి హాస్టల్‌లో మందుల స్టాక్ ఉండేలా చూడాలి.

ప్రభుత్వ స్కూళ్లలో రెగ్యులర్ ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి చేయాలిచంద్రశేఖర్ యాదవ్ మాట్లాడుతూ “కూటమి ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. మొద్దు నిద్రలేచి తక్షణ చర్యలు తీసుకోవాలి” అని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వెంకట్ రాయల్, నగర అధ్యక్షుడు కైలాష్, ప్రధాన కార్యదర్శులు అశోక్ రాయల్, నరేందర్ రెడ్డి, రాహుల్ రెడ్డి, లోకేష్, సాయి, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రపంచం గర్వించదగిన రీతిలో అంబేద్కర్‌ విగ్రహం: మంత్రి మేరుగ

TV4-24X7 News

4687 మినీ అంగన్వాడీ కార్యకర్తలకు పదోన్నతి

TV4-24X7 News

ఢిల్లీ జగన్ ధర్నాలో పాల్గొన్న వాసుపల్లి గణేష్ కుమార్

TV4-24X7 News

Leave a Comment