ఫైనాన్స్ సంస్థల ఒత్తిళ్లకు యువకుడు బలైన ఘటన మైదుకూరులో విషాదం నింపింది.
మైదుకూరుకు చెందిన రమేష్ (22) బట్టల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల అతడు ఫైవ్ స్టార్ ఫైనాన్స్ కంపెనీ వద్ద ₹4.25 లక్షల రుణం తీసుకున్నాడు. రుణ చెల్లింపులో జాప్యం జరగడంతో కంపెనీ తరఫున వసూలు ఒత్తిడి పెరిగింది.
తాకట్టు పెట్టిన ఇల్లు కోల్పోతామన్న భయం, సంస్థ ప్రతినిధుల వేధింపులు రమేష్‌ను తీవ్రంగా కలవరపరిచాయి. మానసిక వేదన తాళలేక అతడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గుర్తించి ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు నిలువలేకపోయాయి.
ఈ ఘటనపై రమేష్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

