Tv424x7
Telangana

ఆత్మహత్యకు పాల్పడిన కుటుంబానికి కేటీఆర్ ఆర్థిక సాయం….

ములుగు మున్సిపాలిటీకి చెందిన పారిశుద్ధ్య కార్మికుడు మహేష్ జీతాలు అందక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ సందర్భంలో బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ ఆర్థిక సాయం అందించారు.

👉 మహేష్ కుటుంబానికి రూ. 5,50,000 విలువైన చెక్కును ఈరోజు ములుగు బీఆర్ఎస్ నాయకురాలు బడే నాగజ్యోతి ప్రత్యక్షంగా అందజేశారు.

ఈ సందర్భంగా నాగజ్యోతి మాట్లాడుతూ –“పేద కార్మికుల కష్టాలు ఇలా ప్రాణాలు తీస్తే మనసు కలిచివేస్తుంది. కుటుంబానికి పార్టీ తరఫున పూర్తి మద్దతు అందిస్తాం” అని హామీ ఇచ్చారు.

మున్సిపల్ కార్మికులకు తక్షణమే జీతాలు అందేలా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని కూడా ఆమె డిమాండ్ చేశారు.

స్థానికులు ఈ ఆర్థిక సాయం పట్ల కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు మున్సిపల్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఇలాంటి ఘటనలు మళ్లీ జరగొచ్చని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related posts

గోదావరికి ఉద్ధృతి.. మంత్రి పొంగులేటి సమీక్ష

TV4-24X7 News

గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

TV4-24X7 News

జోహో మెసెజింగ్ యాప్‌పై స్వదేశీ కుట్రలు కూడా!

TV4-24X7 News

Leave a Comment