ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకానికి రాష్ట్రవ్యాప్తంగా మహిళలు అధిక సంఖ్యలో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో వాడపల్లి బస్టాండ్ వద్ద బస్సులకు మహిళల తాకిడి గణనీయంగా పెరిగింది.
మహిళలకు ఉచిత ప్రయాణం లభిస్తుండటంతో బస్సులు నిండిపోవడంతో పురుషులకు సీట్లు దొరకడం కష్టమైపోతోందని వారి వాదన. “మాకు రక్షణ లేకుండా పోతుంది, ప్రయాణం కోసం ప్రత్యేక బస్సులు వేయాలి” అంటూ పురుషుల వర్గం వాయిస్ ఎత్తుతోంది.
ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం ఒకవైపు మహిళలకు పెద్ద మేలు చేస్తుండగా, మరోవైపు సాధారణ ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు.

