Tv424x7
Telangana

ఏసీబీ వలలో విద్యుత్ శాఖ ఏడీఈ – కోట్ల విలువైన ఆస్తుల బహిర్గతం!!

హైదరాబాద్‌లో అవినీతి నిరోధక శాఖ (ACB) భారీ సోదాలు నిర్వహించింది. విద్యుత్‌శాఖలో ఏడీఈగా పనిచేస్తున్న అంబేడ్కర్‌పై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో మంగళవారం ఉదయం నుండి మణికొండ, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్‌తో పాటు మొత్తం 15 చోట్ల ఏకకాలంలో దాడులు జరిపారు.

👉 అంబేడ్కర్‌ బంధువు సతీష్‌ నివాసంలో ₹2 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
👉 గచ్చిబౌలిలో విలాసవంతమైన భవనం, హైదరాబాద్‌లో 3 ప్లాట్లు, పెన్‌పహాడ్ (సూర్యాపేట జిల్లా)లో 10 ఎకరాల భూమి, హైదరాబాద్ శివారులో వెయ్యి గజాల్లో ఫార్మ్‌హౌస్ గుర్తించారు.
👉 ఇప్పటివరకు బయటపడిన ఆస్తులు ఆదాయానికి మించి ఉన్నాయని ఏసీబీ డీఎస్పీ ఆనంద్ తెలిపారు.

అంబేడ్కర్‌ వందల కోట్ల ఆస్తులు అక్రమంగా కూడబెట్టినట్లు ప్రాథమిక సమాచారం ఉన్నందున, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మెదక్ జిల్లాల్లోని బంధువుల ఇళ్లు కూడా తనిఖీ చేస్తున్నారు.

🔴 ఈ సోదాలు ఈరోజు రాత్రి వరకూ కొనసాగే అవకాశం ఉందని ఏసీబీ పేర్కొంది.
🔴 విద్యుత్‌శాఖలోని ఈ అవినీతి వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

Related posts

పాతబస్తీ మాన్‌హోల్ ఘటనపై HYDRAA పై ప్రభుత్వం సీరియస్!!

TV4-24X7 News

పని కట్టుకుని కొందరు దుష్ప్రచారం చేసారు: కవిత

TV4-24X7 News

జాతీయ సమైక్యత దినోత్సవం…

TV4-24X7 News

Leave a Comment