Tv424x7
Andhrapradesh

ప్రైవేట్ బస్సు ఢీకొని ఇద్దరి మృతి…..

గిద్దలూరు, సెప్టెంబర్ 17:

గిద్దలూరు నియోజకవర్గంలో మంగళవారం రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుని ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు.

మొదటి ఘటన గిద్దలూరు మండలం ముండ్లపాడు వద్ద జరిగింది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న సిద్దయ్యను ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టగా, ఆయన తీవ్రంగా గాయపడ్డారు. గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.

రెండో ఘటన కొమరోలు మండలం తాటిచెర్ల మోటు వద్ద చోటుచేసుకుంది. నడుచుకుంటూ వెళ్తున్న రమణను బొలెరో వాహనం ఢీకొట్టడంతో గాయాలపాలయ్యాడు. గిద్దలూరు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నంద్యాల తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు.

ఈ ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

మిస్సింగ్ కేసును ఛేదించిన వన్ టౌన్ పోలీసులు

TV4-24X7 News

కూటమిలోకి ఎంట్రీ లేకనే వాసుపల్లి కొత్త డ్రామా మానసిక ఆస్పత్రిలో చికిత్స అవసరం

TV4-24X7 News

అంబటి రాయుడు భార్య, పిల్లలకి హత్యాచార బెదిరింపులు

TV4-24X7 News

Leave a Comment